కలెక్టర్ ​వెయిట్​ చేసినా ఎమ్మెల్యే రాలే!

నల్గొండ​ అర్బన్​, వెలుగు : దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి కోసం కలెక్టర్ వినయకృష్ణారెడ్డి వెయిట్​ చేయాల్సి వచ్చింది. అయినా ఎమ్మెల్యే రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. మంగళవారం నల్గొండలో జరిగిన దొడ్డికొమరయ్య వర్ధంతి కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్​రోడ్​లో ఉన్న కొమరయ్య విగ్రహానికి పూలమాల వేసేందుకు కలెక్టర్ ​వెళ్లారు. 

కానీ, అదే టైంలో ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి నల్గొండ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యే రావడం  ఆలస్యమవుతుందని తెలుసుకున్న కలెక్టర్..​కొమురయ్య విగ్రహానికి పూలమాల వేసి వెళ్లి పోయారు. తర్వాత వచ్చిన ఎమ్మెల్యే కొమురయ్య విగ్రహానికి నివాళులర్పించారు.