హైదరాబాద్/రంగారెడ్డి/మేడ్చల్ కలెక్టరేట్/వికారాబాద్, వెలుగు: ప్రజావాణికి అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని అడిషనల్ కమిషనర్ శ్రీవాత్సవతో కలిసి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 30 ఫిర్యాదులో అందాయి. వీటిలో టౌన్ ప్లానింగ్ కు సంబంధించి15, ట్రాన్స్ పోర్టుకు 1, రెవెన్యూ 5, సీఈ మెయింటెనెన్స్ 2, ఎఫ్ఏ 2, ఎలక్షన్స్ 2, అడ్మినిస్ట్రేషన్ 2, లేక్స్ విభాగానికి ఒకటి అందాయి. ఆరు జోన్లలో మొత్తం 147 అర్జీలు వచ్చాయి.
చార్మినార్ జోన్ లో 4, సికింద్రాబాద్ జోన్ లో 18, కూకట్ పల్లి జోన్ లో 61, శేరిలింగంపల్లి జోన్ లో 51, ఖైరతాబాద్ జోన్ లో 1, ఎల్బీనగర్ జోన్ లో 12 విజ్ఞప్తులు వచ్చాయి. ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా 9 విన్నపాలు రాగా సంబంధిత అధికారులకు పంపించారు. అలాగే హైదరాబాద్కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 145 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొని అర్జీలు స్వీకరించారు. ఇందులో గృహ నిర్మాణ శాఖకు 93, పెన్షన్ కోసం 11, ఇతర శాఖలకు సంబంధించినవి 41 అందాయని కలెక్టర్ తెలిపారు. అలాగే ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 110 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్శశాంక ఫిర్యాదులు స్వీకరించారు.
మేడ్చల్– మల్కాజిగిరి కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి 124 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ గౌతమ్ ఫిర్యాదులు స్వీకరించారు. వికారాబాద్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొన్నారు. విద్య, వైద్య, బీసీ, గిరిజన సంక్షేమం, విద్యుత్, పంచాయతీ, పింఛన్లు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్, భూ సర్వే తదితర అంశాలకు సంబంధించి 122 ఫిర్యాదులు అందాయని తెలిపారు.