
బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ పట్టణంలోని పాత బాన్సువాడ రోడ్డులో బేతాళ స్వామి ఆలయం దగ్గర నల్ల పోచమ్మ విగ్రహాన్ని ఆదివారం ఘనంగా ప్రతిష్ఠించారు. మూడు రోజులపాటు ఈ మహోత్సవాలు నిర్వహించి చివరి రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపన జరిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన హంపీ పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామీజీ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.
వేద పండితులు జపాల చంద్రశేఖర్ శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాపన ఉత్సవాలు పెద్ద ఎత్తున జరిగాయి. కార్యక్రమంలో నిర్వాహకులు హనుమంతరావు, బసంత్ రావు, కిరణ్, రాజు తదితరులు పాల్గొన్నారు.