చొప్పదండి, వెలుగు: చొప్పదండి పట్టణంలోని పాత వాటర్ ట్యాంక్, ఎంఈఓ ఆఫీస్ సమీపంలోని వాటర్ ట్యాంకుల నుంచి సరఫరా అవుతున్న నల్లా నీళ్లు రంగు మారి వస్తున్నాయని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.
కొద్ది రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు మట్టితో కలుషితమై, రంగు మారి దుర్వాసన వస్తున్నాయని చెబుతున్నారు. మురికి వస్తుండడంతో జనం ఆ నీళ్లను తాగడం లేదు. ఈ నీటితో స్నానం చేస్తే దురద రావడంతోపాటు నీచు వాసన వస్తున్నాయంటున్నారు.