నల్గొండ అర్బన్, వెలుగు : ఇండియన్ పోలీస్ మెడల్ కి నల్లగొండ అడిషనల్ ఎస్పీ కె.ఆర్.కె ప్రసాద రావు ఎంపికయ్యారు. ఆర్ఎస్ఐగా 1991 బ్యాచ్ కి చెందిన అధికారి ప్రసాదరావు- 1992లో మొట్టమొదటి గ్రే హౌండ్స్ ఏర్పాటు కాలం నుంచి 1997 వరకు 5 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించారు. ప్రసాదరావు- 1993లో ఉత్తమ సేవ, 2009లో కఠిన సేవ పతకానికి ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1993 లో గ్రే హౌండ్స్ లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో ఉత్తమ సేవ పతకం,2009 లో కఠిన సేవ పతకం లభించిందన్నారు. ఆర్ఎస్ఐ నుండి సివిల్ ఎస్ఐగా కన్వర్షన్ అయ్యి వివిధ హోదాలో కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, ఖమ్మం జిల్లాలలో పని చేశానని,ఈ రోజు ఇండియన్ పోలీస్ మెడల్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.