కోల్బెల్ట్, వెలుగు: కళా రంగాన్ని కాపాడుతూ కళాకారులను ప్రోత్సహించాలని మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అన్నారు. శనివారం రాత్రి మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో క్రేజీ స్టార్ డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కల్చరల్ పోటీల బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోల్బెల్ట్ ప్రాంతంలో క్రేజీ స్టార్స్ డాన్స్ అకాడమీ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తూ కళాకారుల్లోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు కృషి చేస్తోందని అభినందించారు. ఈ కార్యక్రమంలో డాన్స్ అకాడమీ అధ్యక్షులు పులిపాక శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఉప్పులేటి నరేశ్, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ సెక్రటరీలు సలేంద్ర సత్యనారాయణ, దాగం మల్లేశ్, తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు నాగరాజు, మంచిర్యాల జిల్లా సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షుడు విశ్వేశ్వర శర్మ, కార్యదర్శి బి.శాంకరి తదితరులు పాల్గొన్నారు.