హైదరాబాద్, వెలుగు: చెన్నూరు టికెట్‌ను మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి కేటాయించేలా చొరవ చూపించాలని బుజ్జగింపుల కమిటీ చైర్మన్ జానారెడ్డిని కాంగ్రెస్ నేత నల్లాల ఓదెలు కోరారు. ఈ మేరకు శుక్రవారం జానా రెడ్డి నివాసంలో చెన్నూరు నేతలు, వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. వివేక్‌లాంటి సీనియర్ లీడర్‌కు టికెట్ఇస్తే ఆయన గెలుపు కోసం ఎలాంటి భేషజాలు లేకుండా పనిచేస్తానని ఓదెలు చెప్పారు.
అధిష్టానం ఎవరికిచ్చినా కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత అని, పార్టీ గెలుపు కోసం పనిచేస్తానని ఆయన అన్నారు. కాగా, పార్టీ ఇంకా ప్రకటించాల్సిన 19 నియోజకవర్గాల్లో చెన్నూరు కూడా ఒకటి. ఆదివారం కాంగ్రెస్ పార్టీ మూడో లిస్ట్ వచ్చే అవకాశాలున్నాయని ఆ పార్టీ సీనియర్ లీడర్ ఒకరు చెప్పారు.
బీసీ స్థానాలపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయినట్టు తెలు స్తున్నది. మిగిలిన స్థానాల్లో బీసీలకు మరో నాలుగు సీట్లు కేటాయించే చాన్స్ ఉన్నట్లు సమాచారం.