కాంగ్రెస్కు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా

ఏపీ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది.  మాజీ  సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాధమిక  సభ్యత్వానికి కూడా ఆయన రిజైన్ చేశారు.  తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి పంపారు. త్వరలో  కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఇప్పటికే ఆయన జాతీయ బీజేపీ నేతలతో సంప్రదింపలు జరిపారు.  2014లో ఏపీ విభజనను వ్యతిరేకించిన కిరణ్ కుమార్ ... కాంగ్రెస్‌కి గుడ్ బై చెప్పిఆ తరువాత  సమైక్య ఆంధ్ర పార్టీ పెట్టారు. కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఆ తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరినప్పటికి యాక్టివ్‌గా లేరు. ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నారు.