నల్లగొండ జిల్లాలో నీళ్లకోసం రోడ్డెక్కారు మహిళలు. గత వారం రోజులుగా తాగు నీటి కోసం అల్లాడుతున్నామని.. పట్టించుకునే నాథుడే లేడని.. చేసేదేమీ లేక ఆందోళన కు దిగారు. కనగల్ మండలం జీ. ఎడవల్లిలో వారం రోజులుగా తాగునీరు, మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని రోడ్డు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
ALSO READ: కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ బోగస్ : మంత్రి జగదీష్ రెడ్డి
సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇరువైపుల వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న కనగల్ ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని మహిళలకు నచ్చజెప్పాందుకు ప్రయత్నించారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని కనగల్ ఎస్సై హామీ ఇవ్వండంతో మహిళలు నిరసన విరమించారు.