రైతుల కోసమే సమావేశాలను  బహిష్కరిస్తున్నాం 

రైతుల కోసమే పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తున్నామన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు. లోక్ సభకు 9 మంది, రాజ్యసభ సమావేశాలకు ఏడుగురు ఎంపీలు దూరంగా ఉంటారని ప్రకటించారు. తెలంగాణ రైతాంగాన్ని కేంద్రం ఇబ్బంది పెట్టేలా   వ్యవహరిస్తుందన్నారు. 9 రోజులుగా అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నా.. తమ అరుపులు,నిరసన కేంద్రానికి వినపడలేదన్నారు. తెలంగాణలో ఇంత పంట ఎలా పండుతుంది అని రైతులను, ప్రజలను అవమానిస్తున్నారన్నారు.  మా బాధను పట్టించుకోలేదు కాబట్టే తాము వాకౌట్ చేశామన్నారు. బిల్లుల కోసం సభ నడుపుకుంటున్నారని..ఈ సమావేశాలకు తాము వెళ్లమని అన్నారు.