బూత్ కమిటీలు వేయండి : నామా నాగేశ్వరావు 

చండ్రుగొండ,వెలుగు: గ్రామాల్లో బూత్ కమిటీలు వేసి సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల పై విస్త్రృత ప్రచారం చేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం  అయ్యన్నపాలెం గ్రామంలోని లాక్ష్య ఫంక్షన్ హాల్ లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి బీఆర్​ఎస్​ ప్రభుత్వ పథకాలు అందాయన్నారు. ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీ కే ఉందని తెలిపారు. ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు అశ్వారావు పేట నియోజకవర్గానికి చేసిన అభివృద్ధే ఆయనను అధిక మెజార్టీ తో గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం వైస్ ఎంపీపీ సత్యనారాయణ, దామరచర్ల ఎంపీటీసీ వెంకటకుమారి, సర్పంచ్ లక్ష్మీపతి ,పలువురు నాయకులకు గులాబీ  కండువాలకు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దామరచర్ల గ్రామానికి చెందిన సంగొండి రాఘవులను బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు సమావేశంలో ప్రకటించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల ఇన్​చార్జి వెంకటరమణ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు జోగేశ్వరావు, పార్టీ మండల అధ్యక్షుడు దారా వెంకటేశ్వరావు, ఎంపీటీసీ విజయలక్ష్మి, నాయకులు వెంకటనారాయణ, మోహన్ రావు, వెంకటేశ్వర్లు, రసూల్, లింగయ్య, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.