ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం సిటీని మరింత అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. బుధవారం నగరంలోని కార్పొరేషన్ ఆఫీసులో మేయర్ నీరజ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ఎజెండాలోని11 అంశాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. మేయర్ మాట్లాడుతూ రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్నారు. నగరంలో సేకరించిన చెత్తను సైంటిఫిక్ మెథడ్‌లో క్లియర్ చేసిన తరువాత సెగ్రిగేషన్ చేస్తున్నట్లు చెప్పారు. కమిషనర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ఆగస్టు నుంచి వాణిజ్య సముదాయాలు, హోటల్స్, ఫంక్షన్ హాల్స్ నుంచి చెత్త సేకరిస్తున్నట్లు తెలిపారు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో బల్క్ జనరేటర్స్ఏర్పాటు చేసి వర్కర్స్‌ను ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకున్నట్లు చెప్పారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, నగరపాలక సిబ్బందిపాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
- బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు పొంగులేటి
ఖమ్మం, వెలుగు: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఇంటింటికీ ప్రచారం చేయాలని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ, తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి సూచించారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 7న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలింగ్ బూత్ స్థాయి నుంచి సమావేశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశాన్ని సక్సెస్ చేయాలని కోరారు. ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో 5 వేల మంది కార్యకర్తలకు తగ్గకుండా పాల్గొనాలని కోరారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారని తెలిపారు. కార్యకర్తలు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారని, కష్టపడి పని చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర నాయకులు గంటేల విద్యాసాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్యామ్ రాథోడ్, రుద్ర ప్రదీప్, నున్న రవికుమార్, జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి రాజేశ్‌గుప్తా, వైరా అసెంబ్లీ కన్వీనర్ నెల్లూరు కోటేశ్వరరావు, యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు అనంత ఉపేందర్ గౌడ్, పిల్లలమర్రి వెంకట్, డీకొండ శ్యామ్, విక్రమ్ జాదవ్, దుద్దుకూరు కార్తీక్, శంకర్ గౌడ్, ఫజల్ పాల్గొన్నారు.
గిరిజన విద్యార్థినికి అరుదైన అవకాశం
అశ్వారావుపేట, వెలుగు: మండలంలోని అతిమారుమూల గ్రామమైన మొద్దులమాడ గ్రామానికి చెందిన చిప్పల బాపిరెడ్డి కుమార్తె చిప్పల రేణుక రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకుంది. హైదరాబాద్‌లోని ఐటీడీఏ గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఈ నేపథ్యంలో గురువారం రాజ్ భవన్ లో కొండరెడ్ల జీవన విధానం, స్థితిగతులు, విద్య, సౌకర్యాలు, ఐటీడీఏ ద్వారా అందిస్తున్న పథకాలను వివరిస్తూ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కానున్న రాష్ట్రపతికి దాదాపు గంటసేపు ఇంగ్లిష్ భాషలో ఈ విషయాలను రేణుక వివరించనుంది.
మెరుగైన వేతనం కోసం పోరాడుతాం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: దేశంలోని బొగ్గు గని కార్మికుల సమస్యలు, మెరుగైన వేతన ఒప్పందం కోసం దశల వారీ ఆందోళనలు చేపడతామని ఆలిండియా కోల్ వర్కర్స్ ఫెడరేషన్ వర్కింగ్ కమిటీ(ఏఐసీడబ్ల్యుఎఫ్) జనరల్ సెక్రటరీ రామానందం తెలిపారు. కమిటీ రెండు రోజుల సమావేశాలు కొత్తగూడెంలోని పీఆర్ ఫంక్షన్ హాల్లో బుధవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంతో పాటు బీహార్, ఒడిశా, చత్తీస్ఘడ్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమంపై పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మెరుగైన వేతన ఒప్పందం విషయంలో కోల్ ఇండియా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. సింగరేణికి సంబంధించిన నాలుగు కొత్త బ్లాక్‌లను సింగరేణికి ఇవ్వడంలో కోల్ మినిస్ట్రీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. వచ్చే నెల 3న నిర్వహించే జేబీసీసీఐ మీటింగ్‌లో వేతన ఒప్పందం విషయంలో కోల్ ఇండియా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దేశ వ్యాప్త సమ్మెపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజారావు, మందా నర్సింహారావు, శ్రీవాత్సవ, మానస ముఖర్జీ, తుమ్మల రాజిరెడ్డి, నాగరాజు, గోపాల్, విజయగిరి శ్రీనివాస్, మెండే శ్రీనివాస్ పాల్గొన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా
చండ్రుగొండ, వెలుగు: కార్యకర్తలకు అండగా ఉంటానని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. బుధవారం మండలంలోని మద్దుకూరు గ్రామంలో విద్యుత్ షాక్ తో చనిపోయిన రైతు తన్నీరు కిరణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు. పొలం పనులు చేసేటప్పుడు కరెంట్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇటీవల ఎంతో మంది రైతులు కరెంట్‌షాక్ కు గురై చనిపోవడం బాధాకరమన్నారు. ఆయనవెంట గానుగుపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, గుంపెన సొసైటీ చైర్మన్ బోయినపల్లి సుధాకర్ రావు, వైస్ చైర్మన్ నల్లమోతు వెంకటనారాయణ, ఉప్పతల ఏడుకొండలు, మాలోత్ భోజ్యా నాయక్, నరుకుల్ల సత్యనారాయణ, కొత్తూరు వెంకటేశ్వరరావు, నున్న బసవయ్య, గాదె లింగయ్య, జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ రసూల్, చాపలమడుగు లక్ష్మణరావు, ఓరుగంటి శ్రీనివాసరావు, నల్లమోతు అంజిబాబు, మామిళ్లపల్లి రామారావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.