అన్నపురెడ్డిపల్లి, వెలుగు : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఖమ్మం ఎంపీ, లోకసభాపక్ష నేత నామా నాగేశ్వరావు కార్యకర్తలను ఆదేశించారు. ఆదివారం అన్నపురెడ్డిపల్లి లో నిర్వహించిన మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో బూత్ కమిటీలు వేయాలని చెప్పారు.
ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అడగాలని సూచించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తోనే సుస్థిర పాలన సాధ్యమన్నారు. సమావేశంలో ఎంపీపీ లలిత, జడ్పీటీసీ లాలమ్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్ రావు, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.