తెలంగాణకు కేంద్రం చేసిందేమి లేదని బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర్ రావు అన్నారు. కేంద్రం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వలేదని..రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి అంశంలో కేంద్రాన్ని నిలదీస్తామని..ఈ 8 ఏళ్లలో ఏం చేశారో చెప్తామన్నారు. తెలంగాణ పథకాలను కాపీ కొట్టి అమలు చేస్తున్నారని విమర్శించారు.
రాష్ట్రపతి మీద, ఆమె ప్రసంగం మీద గౌరవం ఉందని నామా నాగేశ్వర్ రావు అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి నిన్న అఖిలపక్షంలో చెప్పినా ఇవాళ్టి ప్రసంగంలో ఆ ప్రస్తావనే లేదన్నారు. రైతుల సమస్యలపై కూడా ప్రస్తావించలేదన్నారు. ఇరిగేషన్ మీద మాట్లాడే హక్కు కేంద్రానికి లేదని చెప్పారు. తెలంగాణలో ఇరిగేషన్ రంగం అభివృద్ధి ఏంటో కేసీఆర్ చేసి చూపించారని అన్నారు.