తెలంగాణపై కేంద్రం కక్ష సాధిస్తోందన్నారు బీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర్ రావు. తెలంగాణకు సాయం చేస్తున్నట్లుగా కేంద్రం అబద్ధాలు చెబుతోందన్నారు. కేంద్ర సాయం లేకుండానే తెలంగాణ అభివృద్ధి చెందుతున్నారు. కాళేళ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. తెలంగాణ నుంచే కేంద్రానికి నిధులు ఇస్తున్నామని చెప్పారు. లోక్ సభలో అమిత్ షా అన్నీ అబద్ధాలు చెప్పారని.. అందుకే ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామని చెప్పారు.
ALSO READ :బీఆర్ఎస్ -కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం
రాష్ట్రాలన్నింటిని కేంద్రం సమానంగా చూడట్లేదని విమర్శించారు నామానాగేశ్వర్ రావు . విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సినవి దక్కలేదన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కానీ, నవోదయ స్కూల్ కానీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ బిడ్డలపై కేంద్రానికి ఎంతుకంత కోపమో అర్థం కావట్లేదని చెప్పారు. దేశంలో అనేక రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ గా ఉందని వెల్లడించారు.