మంచు విష్ణు హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకుడు. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. గురువారం ఇందులో నటించబోయే హీరోయిన్ పేరును రివీల్ చేశారు. మోడల్, నటి, భరతనాట్యం డ్యాన్సర్ అయిన ప్రీతి ముకుందన్.. విష్ణుకు జంటగా నటించనున్నట్టు చెప్పారు.
ఈ క్యారెక్టర్ కోసం చాలామందిని ఆడిషన్స్ చేసి ప్రీతిని ఫైనల్ చేశామని.. తన డ్యాన్సింగ్ టాలెంట్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్‌గా నిలుస్తుందని అన్నారు. అలాగే యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఆమె కనిపించనుందట. ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. అక్కడే ఎనభై శాతం వరకూ చిత్రీకరించనున్నారు.