శుక్రవారం వచ్చిందంటే చాలు సినిమాల పండుగ మొదలవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ సినిమాను శుక్రవారం థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేసుకుంట్టారు మేకర్స్. అందుకే శుక్రవారం వచ్చిందంటే థియేటర్స్ ముందు సందడి మొదలవుతుంది. ఇక తెలుగులో అయితే RTC క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య(Sandhya), సుదర్శన్(Sudharshan) దగ్గర అయితే స్టార్ హీరోల ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తారు. అలా సుదర్శన్ 35MM అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)కి, ఆయన ఫ్యాన్స్ కి చాలా సెంటిమెంట్.
అందుకే మహేష్ బాబు సినిమాలకి అక్కడ ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. ఇటీవల వచ్చిన గుంటూరు కారం సినిమాకు కేసుల వీరలెవల్లో సెలబ్రేషన్స్ చేశారు మహేష్ ఫ్యాన్స్. అయితే సుదర్శన్ 35MM అనేది సింగల్ థియేటర్. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా మల్టిఫ్లెక్స్ లు వెలుస్తున్నాయి. అందుకే సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక నిర్ణయం తీసుకున్నారట. ఆ థియేటర్ స్థలాన్ని లీజుకు తీసుకొని.. ఏషియన్ సినిమాస్ తో కలిసి AMB క్లాసిక్ పేరుతో ఓ మల్టీప్లెక్స్ కట్టబోతున్నారట. త్వరలోనే ఈ మిల్టిఫ్లెక్స్ కు సంబందించిన వర్క్ కూడా మొదలుకానుందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక ఈ వార్త తెలుసుకున్న మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ హీరో సెంటిమెంట్ అనుకున్న థియేటర్ ను తానే తీసుకొని ఇలా మల్టీఫ్లేక్స్ కట్టించడం అనేది గొప్ప విషయం అని చర్చించుకుంటున్నారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం సమాచరం మేరకు ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది.