ములుగు జిల్లాకు రామప్ప సమ్మక్క సారలమ్మ పేరుపెట్టాలి

ములుగు జిల్లాకు రామప్ప  సమ్మక్క సారలమ్మ పేరుపెట్టాలి

ములుగు, వెలుగు : ములుగు జిల్లా పేరును రామప్ప దేవాలయం పేరుతో జిల్లాగా పేరు మార్చాలని కలెక్టర్ దివాకర టీఎస్ ను రామప్ప పరి రక్షణ కమిటీ సభ్యులు కోరారు. గురువారం కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాకు రామప్ప సమ్మక్కసార లమ్మ ములుగు జిల్లా అని పేరు పెట్టాలని కోరారు. యునెస్కో. గుర్తింపు పొందిన రామప్ప ఆల యానికి ఈ ప్రాధాన్యం ఇవ్వా లన్నారు. 

ALSO Read : జూన్ 10వ తేదీలోగా వనమహోత్సవం టార్గెట్ రీచ్ కావాలి : కుమార్ దీపక్

ఇటీవల ములుగును సమ్మక్క, సారలమ్మ ములుగు జిల్లాగా పేరు మార్చేందుకు కలె క్టర్ పబ్లిక్ నోటీస్ జారీ చేశారని, ఈ నేపథ్యంలో అభ్యంతరాలు ఉంటే చెప్పాలని సూచించారు. దీంతో రామప్ప పరిరక్షణ కమిటీ సభ్యులు గురువారం రామప్ప పేరును జిల్లాకు యాడ్ చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కమిటీ కన్వీనర్ ఆకిరెడ్డి రామమోహన్ రావు, కోకన్వీనర్ పిల్లలమర్రి రాము పాల్గొన్నారు.