
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉ న్నాయి. కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలో ఉమ్మడి జిల్లాలోని నాలుగు స్థానాలకు చోటు దక్కింది. అందులో రెండు జనరల్, ఒకటి ఎస్సీ, మరొకటి ఎస్టీ స్థానం ఉన్నాయి.
* నర్సంపేట : దొంతి మాధవ రెడ్డి (కాంగ్రెస్)
* స్టేషన్ ఘనపూర్ (SC): సింగపురం ఇందిరా (కాంగ్రెస్)
* ములుగు (ST) : సీతక్క (కాంగ్రెస్)
* భూపాలపల్లి : గండ్ర సత్యనారాయణరావు (కాంగ్రెస్)
వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, జనగామ, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ (ST), వర్ధన్నపేట ( SC), పరకాల స్థానాల్లో అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో మాజీ మంత్రి కొండా సురేఖ పేరు లేదు.