- సూపర్ ఓవర్లో ఓడిన ఒమన్
బ్రిడ్జ్‌టౌన్ (బార్బడోస్) : టీ20 వరల్డ్ కప్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులను అలరించింది. రెండో రోజే సూపర్ ఓవర్ పోరు సందడి చేసింది.ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్ (3/28) అదరగొట్టడంతో సోమవారం ఉదయం జరిగిన మ్యాచ్‌లో నమీబియా సూపర్ ఓవర్లో ఒమన్‌పై విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 రన్స్ కు ఆలౌటైంది. రూబెన్ ట్రంపెల్‌మన్ నాలుగు, వీస్ మూడు వికెట్లు తీశారు. నమీబియా బౌలర్ రూబెన్ ఇన్నింగ్స్ తొలి రెండు బాల్స్‌కు కశ్యప్ ప్రజాపతి (0), కెప్టెన్ అకీక్ ఇల్యాస్ (0)ను ఔట్ చేశాడు.
దాంతో ఇంటర్నేనల్ టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి రెండు బాల్స్‌కు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. నసీమ్ ఖుషి (6) ఫెయిలవగా.. ఖలిద్ కైల్ (34), జీషన్ మఖ్సూద్ (22), అయాన్ ఖాన్ (15) రాణించడంతో ఓమన్ స్కోరు వంద దాటింది. అనంతరం ఛేజింగ్‌లో నమీబియా ఓవర్లన్నీ ఆడి 109/6 స్కోరు చేసింది. జాన్ ఫ్రైలింక్ (45), నికోలస్ డేవిన్ (24) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో నమీబియాకు ఆరు రన్స్ అవసరం అవగా.. ఒమన్ బౌలర్ మెహ్రన్ ఖాన్ రెండు వికెట్లు తీసి నాలుగే ఇవ్వడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
సూపర్ ఓవర్లో బిలాల్ ఖాన్ బౌలింగ్‌లో వీస్ 4, 6, 2, 1... గెరాల్డ్ 4, 4 కొట్టడంతో నమీబియా 21/1 స్కోరు చేసింది. వీస్ వేసిన ఓవర్లో ఒమన్ ఓ వికెట్ కోల్పోయి పదే రన్స్ చేసి ఓడిపోయింది. డేవిడ్ వీస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.