కిర్టిపూర్ (నేపాల్) : టీ20 క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. నమీబియా బ్యాటర్ జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్ ఈ ఫార్మాట్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ (33 బాల్స్)తో రికార్డు సృష్టించాడు. ట్రై నేషన్స్ సిరీస్‌లో భాగంగా నేపాల్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లోఫ్టీ ఈటన్ ఈ ఫీట్‌ను సాధించాడు. దీంతో గతేడాది ఆసియా గేమ్స్‌లో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా 34 బాల్స్ చేసిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును అతను బ్రేక్ చేశాడు.
ఓవరాల్‌గా ఈటన్ (36 బాల్స్‌లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 101) సంచలన పెర్ఫామెన్స్‌తో నమీబియా 20 ఓవర్లలో 206/4 స్కోరు చేసింది. క్రుగెర్ (59 నాటౌట్) రాణించగా, లోఫ్టీ ఈటన్ బౌండ్రీల ద్వారా 92 రన్స్ రాబట్టాడు. ఛేజింగ్‌లో నేపాల్ 18.5 ఓవర్లలో 168 రన్స్‌కు ఆలౌటైంది. దీపేంద్ర సింగ్ (48) టాప్ స్కోరర్. ఈటన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.