కునో నేషనల్ పార్క్‌లో.. 3పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత 'జ్వాల'

కునో నేషనల్ పార్క్‌లో.. 3పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత 'జ్వాల'

నమీబియా చిరుత 'జ్వాల' మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మూడు పిల్లలకు జన్మనిచ్చిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తెలిపారు. నమీబియా చిరుత 'ఆషా' తన పిల్లలకు జన్మనిచ్చిన కొద్ది వారాల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కునోలో కొత్త పిల్లలు! జ్వాలా అనే నమీబియా చిరుత మూడు పిల్లలకు జన్మనిచ్చిందని, ఇది నమీబియా చిరుత ఆషా తన పిల్లలకు జన్మనిచ్చిన కొన్ని వారాల తర్వాత జరిగిందని యాదవ్ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను కూడా పంచుకున్నారు.
 
అంతకుముందు 2023 మార్చిలో, జ్వాలాగా పేరు మార్చిన సియాయా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. కానీ ఇప్పుడు వాటిలో ఒకటి మాత్రమే జీవించి ఉంది. జ్వాలా కూడా నమీబియా నుండి కునోకి బదిలీ చేయబడింది. కాగా, కొత్తగా పుట్టిన ఈ మూడు పిల్లలతో కలిపి కునో నేషనల్ పార్క్‌లో మొత్తం చిరుతల సంఖ్యను 20కి చేరింది. జనవరి 16న కునో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుత 'శౌర్య' మరణించిన కొన్ని రోజుల తర్వాత ఈ శుభవార్త రావడం కాస్త ఊరట కలిగిస్తోంది. సెప్టెంబరు 2022లో నమీబియా నుండి తీసుకువచ్చిన శౌర్య ఆరోగ్య సమస్యలతో మరణించింది. ఇది మార్చి 2023 నుండి ఏడవ వయోజన చిరుత, మూడవ పిల్ల మరణాన్ని సూచిస్తుంది.

చిరుత పునరుద్ధరణ ప్రాజెక్ట్ కింద, సెప్టెంబరు 17, 2022న ఐదు ఆడ, మూడు మగ చిరుతలతో సహా నమీబియా నుండి ఎనిమిది పెద్ద పులులను పార్క్‌లోని ఎన్‌క్లోజర్‌లలోకి విడుదల చేశారు.