దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, నమీబియా వెటరన్ ఆల్‌రౌండర్ డేవిడ్ వీస్(39) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నమీబియా ఓటమి తరువాత వీస్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ఔటై డగౌట్‌కు వెళ్తున్న సమయంలో ఈ వెటరన్ ఆల్‌రౌండర్ ప్రేక్షకులకు, సహచరులకు చేతులు ఊపుతూ తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పాడు.
"తదుపరి టీ20 ప్రపంచకప్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. నాకిప్పుడు 39 సవంత్సరాలు. అంతర్జాతీయ క్రికెట్ పరంగా నాకు ఎంత సమయం మిగిలి ఉందో నాకు తెలియదు. నమీబియాతో నా కెరీర్‌ను ముగించడానికి ఇదే మంచి సమయమని భావిస్తున్నాను. సహచరులతో మంచి సమయాన్ని గడిపాను. ప్రపంచ స్థాయి జట్లతో చివరి ఆట ఆడాను. ముగింపుకు ఇది సరైన సమయమని అనిపించింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా.." అని వీస్ తెలిపాడు.
సౌతాఫ్రికా తరుపున అరంగ్రేటం
యాదృచ్చికంగా వీస్ దక్షిణాఫ్రికా తరపున 2013 టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్‌లో ఆడాడు. అనంతరం 2016 ఎడిషన్‌లో చివరిసారి ప్రోటీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆపై 2016లో దక్షిణాఫ్రికాతో అంతర్జాతీయ కెరీర్ ముగించి ససెక్స్‌తో మూడేళ్లు కొనసాగాడు. అనంతరం 2021లో నమీబియా తరపున టీ20 ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేశాడు. నమీబియా తరపున 34 టీ20ల్లో 532 పరుగులు, 35 వికెట్లు తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వీస్.. ఫ్రాంచైజీ క్రికెట్‌లో కొనసాగనున్నాడు.
David Wiese stepped up with both bat and ball for South Africa and Namibia ✨
— ESPNcricinfo (@ESPNcricinfo) June 16, 2024
The allrounder announced his retirement from international cricket 👉 https://t.co/sjc4wPUWJF #T20WorldCup pic.twitter.com/4bNc8Gz4C2