నమీబియా ప్రెసిడెంట్ హేజ్ గింగోబ్ మృతి

హరారే: నమీబియా  ప్రెసిడెంట్ హేజ్‌‌ గింగోబ్‌‌ (82) ఆదివారం మరణించారు. కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న గింగోబ్.. ​లేడీ పోహంబా హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారని ప్రెసిడెంట్ ఆఫీస్ పేర్కొంది. ఆయన మరణవార్తతో దేశం విషాదంలో మునిగిపోయింది. గింగోబ్ 2015లో ప్రెసిడెంట్​గా ఎన్నికై సుదీర్ఘ కాలం పాటు నమీబియాను పాలించారు. గింగోబ్​ మృతి దేశానికి తీరని లోటని తాత్కాలిక అధ్యక్షుడు అంగోలో ముంబా తెలిపారు. కేబినెట్ తక్షణమే సమావేశమై తదుపరి కార్యాచరణపై ప్రకటన చేస్తుందని చెప్పారు. కొత్త ప్రెసిడెంట్​ను ఎన్నుకునేందుకు నవంబర్​లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, గింగోబ్ మృతికి దక్షిణాఫ్రికా, జింబాబ్వే, కెన్యా దేశాధినేతలు నివాళులు అర్పించారు.