![ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పూర్తి.. బరిలో 19 మంది అభ్యర్థులు](https://static.v6velugu.com/uploads/2025/02/naminations-withdraw-process-completed-and-3-members-withdrawn-in-teachers-mlc_VOuDbTedcR.jpg)
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఇందులో భాగంగా మొత్తం 22 మందిలో గురువారం (ఫిబ్రవరి 13) ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
వరంగల్ -ఖమ్మం -నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లను బుధవారం (ఫిబ్రవరి 13) స్క్రుటినీ అధికారులు పూర్తి చేశారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు, రాష్ట్ర పర్యావరణ, అటవీ,సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్ సమక్షంలో నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో నామినేషన్లను పరిశీలించారు.
23 మంది అభ్యర్థులు50 నామినేషన్ సెట్లను దాఖలు చేయగా, ఇండిపెండెంట్ అభ్యర్థి తుండు ఉపేందర్ నామినేషన్ పత్రాలపై సంతకం లేని కారణంగా తిరస్కరించారు. మిగిలిన 22 మంది అభ్యర్థులు సక్రమంగా ఉన్నట్లు బుధవారం ప్రకటించారు.
అయితే ఇవాళ (గురువారం, ఫిబ్రవరి 13) నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది కావడంతో మొత్తం 22 మందిలో 3 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.