నిజామాబాద్ జిల్లాలో కుక్కకు బారసాల..యాటను కోసి బంధువులకు విందు

నిజామాబాద్ జిల్లాలో కుక్కకు బారసాల..యాటను కోసి బంధువులకు విందు

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం మానిక్భండార్ కు చెందిన నర్సాగౌడ్, మంజుల రెండేండ్ల కింద లాబరో జాతి ఆడకుక్కను తెచ్చుకొని లూసీ పేరుతో పెంచుకోగా అది ఏడు కుక్కపిల్లలకు జన్మనిచ్చింది. 21 రోజుల వయస్సు కుక్కపిల్లలకు బారసాల నిర్వహించి వేడుక చేశారు. 

బెలూన్స్ కట్టిన ఊయలలో వేశారు. జోలపాటలు పాడారు. ఇంట్లోని వారంతా కొత్త దుస్తులు ధరించి బంధువులు, స్నేహితులను ఆహ్వానించి యాటను కోసి విందు చేశారు. నిజామాబాద్, వెలుగు