తండేల్ నుంచి నమో నమఃశివాయ సాంగ్ రిలీజ్... సాయిపల్లవి డ్యాన్స్ సూపర్..

తండేల్ నుంచి నమో నమఃశివాయ సాంగ్ రిలీజ్...  సాయిపల్లవి డ్యాన్స్ సూపర్..

టాలీవుడ్ స్టార్ హీరో నాగ చైతన్య, మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ సాయిపల్లవి కలసి జంటగా నటిస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమాకి తెలుగు ప్రముఖ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో నాగ చైతన్య శ్రీకాకుళంకి చెందిన సముద్ర జాలరి యువకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి బుజ్జితల్లి సాంగ్ రిలీజ్ కాగా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. మంచి ఎమోషన్స్ తో కూడి ఉండటంతో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. 

దీంతో మేకర్స్ శనివారం ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ నమో నమఃశివాయ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటని ప్రముఖ సింగర్స్ అనురాగ్ కులకర్ణి, హరిప్రియ పాడగా లిరిక్ రైటర్ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు లిరిక్స్ అందించారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడు. నమో నమఃశివాయ అంటూ సాగే లిరిక్స్.. సాయిపల్లవి క్లాసికల్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంటున్నాయి.

ALSO READ | హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసిందోచ్.. ఎప్పుడంటే.?

ఈ విషయం ఇలా ఉండగా ఈ సినిమా ఇప్పటికే గత ఏడాది డిసెంబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ షూటింగ్ పూర్తీ కాకపోవడం, ఎడిటింగ్ పనులు నిలిచిపోవడం వంటి కారణాలతో రిలీజ్ వాయిదా పడింది. దీంతో ఈ ఏడాది ఫైబరువారి 7న ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాంగ్స్ తో ఈ సినిమాపై మంచి పెరుగుతోంది. దీంతో ట్రైలర్ అప్డేట్ ఎప్పుడొస్తుందోనని నాగ చైతన్య ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.