అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) నేచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం తండేల్ (Thandel_. టాలెంటెడ్ దర్శకుడు చందు మొండేటి (Chandu mondeti) ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.
తాజాగా తండేల్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. నమో నమః శివాయ అంటూ సాగే సాంగ్ ప్రోమో ఆకట్టుకుంటోంది. శివ-పార్వతులకు చై, సాయి పల్లవి సంగీత విందు అందించేలా ఉంది. దేవిశ్రీ స్వరపరిచిన ఈ పూర్తి పాట జనవరి 4న సాయంత్రం 5.04 గంటలకు రిలీజ్ కానుంది.
చాలా రోజుల నుంచి సాయి పల్లవి డాన్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ పాట కన్నుల పండుగ అవ్వనుందని టాక్. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించిన చై-సాయి పల్లవిల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తండేల్ నుంచి రిలీజైన బుజ్జి తల్లి సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో భారీ బడ్జెతో నిర్మిస్తున్న ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 7న రిలీజ్ కానుంది.