ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావుకు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు. జూన్ 5 వరకు ఉమా మహేశ్వర్ రావు రిమాండ్ లో ఉండనున్నారు. ఏసీబీ అధికారులు ఉమామహేశ్వర్ రావును నాంపల్లి కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు.
ఆదాయానికి మించిన ఆస్తులు,అవినీతి ఆరోపణలతో సీసీఎస్ ACP ఉమా మహేశ్వరరావును మే 21న అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. మే 21న అశోక్ నగర్ లోని ఆయన ఇంటితో పాటు 14 చోట్ల సోదాలు నిర్వహించి.. 17 ప్రాపర్టీలను గుర్తించారు. ఘట్ కేసర్ లో 5 ప్లాట్లు, 38 లక్షల నగదు, 60 తులాల బంగారం సీజ్ చేశారు. ప్రభుత్వ విలువ 3 కోట్లకు పైనే ఉంటుందన్నారు ఏసీబీ అధికారులు. బయటి మార్కెట్ ప్రకారం దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రెండు లాకర్లు గుర్తించారు. శామీర్ పేట్ లో ఒక విల్లా ఉన్నట్లు నిర్దారించారు.
మే 22న ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఉమా మహేశ్వర్ రావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు ఏసీబీ అధికారులు. అనంతరం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.