- 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
- భూకబ్జాకు సహకరించిందని ఆరోపణలు
జీడిమెట్ల, వెలుగు: నాంపల్లిలోని చిట్స్ & ఫైనాన్స్ రిజిస్ట్రార్ ఆఫీసులో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న జ్యోతిని జీడిమెట్ల పోలీసులు మంగళవారం అరెస్ట్‌చేసి, మేడ్చల్కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. ఉప్పుగూడకు చెందిన లేండ్యాల సురేశ్‌కుమార్20 ఏండ్ల కింద కుత్బుల్లాపూర్సుభాశ్నగర్లో 200 గజాల స్థలం కొన్నాడు.
తర్వాత అప్పుడప్పడు వచ్చి చూసుకుని వెళ్లేవాడు. ఈ స్థలంపై బీఆర్ఎస్లీడర్పద్మజారెడ్డి కన్నుపడింది. కరుణాకర్, గగణం నరేంద్ర అలియాస్నందు, రవిశంకర్, నాగిరెడ్డి, కోమల కూమారి సహకారంతో ఫేక్ డాక్యుమెంట్స్తయారు చేసింది. ఆ స్థలాన్ని సూరారంలోని కుత్బుల్లాపూర్సబ్రిజిస్ట్రార్ ఆఫీసులో ఫిబ్రవరి 2003లో రిజిస్ట్రేషన్చేయించింది. అందుకు అప్పటి సబ్‌రిజిస్ట్రార్ జ్యోతి సాయం చేసింది.
తర్వాత జ్యోతి కుత్బుల్లాపూర్ నుంచి బదిలీ అయ్యింది. ప్రస్తుతం నాంపల్లిలోని చిట్స్ & ఫైనాన్స్ రిజిస్ట్రార్ ఆఫీసులో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా చేస్తోంది. అయితే బాధితుడు సురేశ్ఫిర్యాదుతో ఇటీవల పద్మాజారెడ్డితోపాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. విచారణలో భాగంగా జ్యోతిని జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేశారు.