అక్బరుద్దీన్ కేసులో తీర్పు వాయిదా

హైదరాబాద్: MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నాంపల్లి కోర్టు తీర్పును రేపటికి వాయిదా వేసింది. నిర్మల్ జిల్లాలో పదేళ్ల కింద అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదం అయ్యాయి. దీనిపై ప్రసంగంపై ఐపీసీ 120 బీ, 153 ఏ, 295, 298, 188 సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసులు పెట్టారు. ఈ కేసులో అరెస్టయిన అక్బరుద్దీన్.. 40 రోజుల పాటు జైల్లో శిక్ష అనుభవించారు. ఇదే కాదు, ఆదిలాబాద్ లో హిందూ దేవతల మీద అప్పట్లో అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించి నిర్మల్ లో మొదటగా నమోదైన FIR ను మాత్రమే మెయిన్ కేస్ గా భావించి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన నాంపల్లి కోర్టు.. తీర్పును రేపటికి వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో ఇవాళ తీర్పు రానున్న నేపథ్యంలో.. పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ జడ్జిమెంట్ ఇంకా ప్రిపేర్ కాకపోవడంతో.. కోర్టు తీర్పును బుధవారానికి వాయిదా వేసింది. 

మరిన్ని వార్తల కోసం:

ఒకప్పుడు సైడ్ యాక్టర్.. ఇప్పడు హ్యాట్రిక్ హీరో

పాక్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించాలె

ఎక్కువ కాల్షియాన్ని అందించే ఫుడ్స్​ ఇవే..