ఫోన్ ట్యాపింగ్ కేసు.. చంచల్ గూడ జైలు నుంచి పోలీస్ కస్టడీకి రాధాకిషన్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ(2024 ఏప్రిల్ 4) మాజీ డీసీపీ రాధాకిషన్ రావును కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే రాధాకిషన్ రావుకు ఏడు రోజుల కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. దీంతో ఈరోజు ఉదయం చంచల్ గూడ జైలు నుంచి రాధా కిషన్ రావును కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఇప్పటికే రాధాకిషన్ రావుపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. కస్టడీలో రాధాకిషన్ రావును అనేక అంశాలపై దర్యాప్తు చేయనున్నారు పోలీసులు.

ALSO READ : బోరు బావిలో పడిపోయిన రెండేళ్ల చిన్నారి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎన్నికల్లో సమయాల్లో డబ్బులు తరలింపు, ప్రతిపక్షాల డబ్బులు సీజ్ లో సూత్రధారిగా ఉన్న రాధకిషన్ రావ్.. ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తానికి కీలకం కానున్నారు. రిటైర్డ్ ఐజీ ఇప్పట్లో విచారణకు వచ్చే అవకాశాలు తక్కువ కావడంతో.. రాధాకిషన్ నుంచే అన్ని వివరాలు రాబట్టనున్నారు పోలీసులు . 7 ఏళ్ల పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో కీలకంగా వ్యవహరించారు రాధాకిషన్ రావు. ఈరోజు నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రాధాకిషన్ రావు విచారించనున్నారు పోలీసులు.