ఎన్‌‌‌‌వీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌పై కోర్టు ఆగ్రహం‌‌‌‌

ఎన్‌‌‌‌వీఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభాకర్‌‌‌‌పై కోర్టు ఆగ్రహం‌‌‌‌
  • పరువు నష్టం కేసులో విచారణ హాజరుకాకపోవడంపై సీరియస్‌‌‌‌ 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: బీజేపీ నేత ఎన్‌‌‌‌వీఎస్ఎస్ ప్రభాకర్‌‌‌‌పై నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర కాంగ్రెస్‌‌‌‌ వ్యవహరాల ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌ దీపాదాస్ మున్షీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశిస్తూ నవంబర్‌‌‌‌‌‌‌‌ 5కు కేసును వాయిదా వేసింది.

కాంగ్రెస్ నేతలకు పదవులు, ఎన్నికల్లో టికెట్లు ఇప్పించేందుకు దీపాదాస్ మున్షీ బెంజి కారు, ముడుపులు తీసుకున్నారని ఎన్‌‌‌‌వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపణలు చేశారు. దీంతో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ జూన్‌‌‌‌ 7న దీపాదాస్ మున్షీ పరువునష్టం దావా వేశారు. తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు రూ.10 కోట్లు నష్ట పరిహారం ఇప్పించాలని కోర్టును కోరారు.