ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు

నాంపల్లి కోర్టులో మంగళవారం ఓటుకు నోటు ఈడీ కేసులో విచారణ జరిగింది. ఈ రోజు కోర్టు విచారణకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఈ కేసులో రేవంత్ రెడ్డితోపాటు నిందితులుగా ఉన్న మత్తయ్య, ఉదయ్ సింహా, కేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ లు కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో నిందితుల గైర్హాజరుపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సెప్టెంబర్ 24న జరిగే విచారణకు మినహాయింపు ఇవ్వాలని నిందితులు కోర్టును కోరారు.  ఈ మేరకు తదుపరి విచారణ అక్టోబర్ 16న ఉంది. అక్టోబర్ 16న తప్పకుండా విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించింది. రేవంత్ రెడ్డితోపాటు ఓటుకు నోటు కేసులో నిందితులందరూ అక్టోబర్ 16న కచ్చితంగా కోర్టుకు రావాలని నాంపల్లి కోర్టు ఆదేశించింది.

ALSO READ | కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన ఇంజినీర్లు, మాజీ ఇంజినీర్లు