కత్తితో తిరిగిన వ్యక్తికి 5 రోజుల జైలు

  • శిక్ష విధించిన నాంపల్లి కోర్టు

మెహిదీపట్నం, వెలుగు : రాత్రి వేళలో కత్తి పట్టుకుని తిరిగిన వ్యక్తికి నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధించింది. మంగళ్ హాట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్ హౌస్ కు చెందిన రాకేశ్ పురానాపూల్ లోని రహీంపూర్ ఏరియాలో మంగళవారం రాత్రి కత్తి పట్టుకుని తిరుగుతున్నాడు.

పోలీసులు అతడిని అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రాకేశ్ కు 5 రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని పోలీసులు తెలిపారు.