వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. పోలీసులపై దాడి కేసులో సమన్లు జారీ చేసింది. జూన్ 20న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. పోలీసులపై దాడి కేసులో బంజారాహిల్స్ పోలీసులు చార్జ్ షీట్ దాఖుల చేశారు. దీనిని విచారణ చేపట్టిన పోలీసులు ఇవాళ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో విచారణకు హాజరుకావాలంటూ షర్మిలకు నోటీసులు జారీ చేసింది కోర్టు.
పోలీసులపై దాడి కేసులో ఏప్రిల్ 24న షర్మిలను అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరిచగా ఆమెకు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఏప్రిల్ 25న నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.