కొండా సురేఖపై కేసు: డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 12న హాజరు కావాలని నాంపల్లి కోర్టు సమన్లు

 హైదరాబాద్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావాను నాంపల్లి కోర్టు గురువారం విచారించింది. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున దాఖలు చేసిన పిటిషన్ ను పరిగణలోకి తీసుకుంది. కొండ సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 12న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కొండ సురేఖకు సమన్లు జారీ చేసింది.

నాగచైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ కారణమని మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె కామెంట్స్‌‌‌‌పై నాగార్జున నాంపల్లి స్పెషల్‌‌‌‌ కోర్టులో క్రిమినల్ పరువునష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. నాగార్జున, యార్లగడ్డ సుప్రియ,మెట్ల వెంకటేశ్వర్లు వాంగ్మూలాన్ని రికార్డ్‌‌‌‌ చేసిన అనంతరం కోర్టు  నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని కొండా సురేఖను ఆదేశించింది. వీడియో క్లిప్పింగ్స్‌‌‌‌ను ప్రామాణికంగా తీసుకుంది.కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది.