- ‘ఓటుకు నోటు’ ఈడీ కేసులో సీఎం రేవంత్‌కు నాంపల్లి ఎమ్‌ఎస్‌జే కోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు: ‘ఓటుకు నోటు’ కేసులో విచారణకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఆదేశించింది. రేవంత్ రెడ్డితో పాటు కేసులోని ఉదయసింహ, సెబాస్టియన్, సండ్ర వెంకటవీరయ్య, జెరుసలేం మత్తయ్య సహా నిందితులంతా అక్టోబర్ 16న కోర్టులో హాజరుకావాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో అప్పట్లోనే ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు రిజిస్టర్ చేసింది. 2021 మే నెలలో రేవంత్‌రెడ్డి సహా మిగితా నిందితులపై నాంపల్లిలోని ఎమ్‌ఎస్‌జే కోర్టులో ప్రాసిక్యూషన్ కంప్లైంట్(పీసీ, చార్జ్‌షీట్) దాఖలు చేసింది. రూ.50 లక్షలకు సంబంధించి మనీ లాండరింగ్‌అభియోగాలు మోపింది.