ప్రభాకర్రావును కోర్టులో హాజరుపర్చండి:నాంపల్లి కోర్టు

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు అభ్యర్ధనను తోసిపుచ్చింది నాంపల్లి కోర్టు. ప్రధాన నింది తు డు ప్రభాకర్ రావును కోర్టుహాజరు పర్చాలని దర్యాప్తు అధికారులను నాంపల్లి కోర్టు ఆదేశించింది. ప్రధాన నిందితుడు కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించలేమని స్పష్టం చేసింది. పరికరాలను కొనుగోలు చేసిన శ్రవణ్ రావును ఆచూకీ ఇప్పటివరకు ఎందుకు కనుక్కోలేదని పోలీసులను ప్రశ్నించింది. 

Also Read :- భారీ వర్షాలు.. బురదల్లో చిక్కుకున్న యంత్రాలు

ఏ1 ప్రభాకర్రావు, ఏ6 శ్రవణ్రావు పై ఇది వరకే వారెంట్ జారీ అయినందున తదుపరి విచారణ నాటికి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించిన కోర్టు.అనారోగ్యానికి గురై వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని తన లాయర్ ద్వారా గతంలో కోర్టు కి ప్రభాకరరావు తెలిపారు. ప్రభాకర్ రావు అభ్యర్థనను నాంపల్లి కోర్టు తిరస్కరించింది. దీంతో  ప్రభాకర్ రావును అమెరికానుంచి తీసుకొచ్చేందుు పోలీసులు రంగం సిద్ధం చేశారు. త్వరలో అమెరికాకు వెళ్లనున్నారు.