హాజరు కాని కొండా సురేఖ.. నాగార్జున కేసు విచారణ వాయిదా

హాజరు కాని కొండా సురేఖ.. నాగార్జున కేసు విచారణ వాయిదా

ప్రముఖ నటుడు నాగార్జున వేసిన పిటీషన్ పై నాంపల్లి కోర్టు విచారణను ఈ నెల 19కు వాయిదా వేసింది. నాగార్జున వేసిన పిటిషన్ విచారణకు హాజరవ్వాల్సిందిగా మంత్రి కొండా సురేఖకు గతంలోనే కోర్టు నోటీసులు జారీ చేసింది. 

అయితే ఇవాళ (గురువారం)  కోర్టు విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరుకావాల్సి ఉండగా, ఆమె తరఫున న్యాయవాది హాజరయ్యారు.  మంత్రి హాజరకు న్యాయవాది మరో తేదీని కోరగా అందుకు అంగీకరించిన నాంపల్లి కోర్టు విచారణను ఈ నెల (డిసెంబర్) 19కు వాయిదా వేసింది.

Also Read:-అతుల్ సుభాష్ పరిస్థితి మరొకరికి రాకూడదని.. సుప్రీం కోర్టు 8 మార్గదర్శకాలివే..