ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్ కేసు నిందితులకు నో బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌


హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేసు నిందితుల బెయిల్ పిటిషన్లు 4వ సారి డిస్మిస్ అయ్యాయి. మాజీ పోలీసాధికారులు ప్రణీత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లను శుక్రవారం నాంపల్లి కోర్టు కొట్టేసింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తీర్పుఇచ్చింది. దీంతో ఈ కేసులో నిందితులు అరెస్టై 100 రోజులు గడిచినప్పటికీ జైలుకే పరిమితమయ్యారు. ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు 4 సార్లు చార్జ్​షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నిందితులపై మోపిన అభియోగాలకు సరైన ఆధారాలు లేకపోవడంతో పాటు వివిధ కారణాల వల్ల చార్జ్​షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విచారణకు స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. పోలీసులు మంగళవారం దాఖలు చేసిన చార్జ్​షీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కూడా కోర్టు రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసింది.

చార్జ్​షీట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిటర్న్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో మ్యాండేటరీ బెయిల్​కు పిటిషన్లుపోలీసులు దాఖలు చేసిన చార్జ్​షీట్లను కోర్టు విచారణకు స్వీకరించకపోవడంతో నిందితులు మ్యాండేటరీ బెయిల్ పిటిషన్లను దాఖలు చేసుకున్నారు. వీటిపై నిందితుల తరఫు లాయర్లు  శుక్రవారం వాదనలు వినిపించారు. నిర్దిష్ట గడువులోగా చార్జ్​షీట్ దాఖలు చేయని కారణంగా డీఫాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంజూరు చేయాలని డిఫెన్స్ లాయర్లు కోర్టును కోరారు. అయితే, ప్రధాన నిందితుడు ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, ఆరవ నిందితుడు శ్రవణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావు పరారీలో ఉన్నట్టు పోలీసుల తరఫున పబ్లిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. అలాగే, దర్యాప్తు కీలక దశలో ఉందని, ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్యాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి ఇంకా కీలక ఆధారాలు సేకరించడంతో పాటు మరికొంత మంది సాక్షులను విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు శుక్రవారం తీర్పు  వెల్లడించింది. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది.