శివరాంను అరెస్ట్ చేయొద్దు: నాంపల్లి కోర్టు

ప్రవళిక కేసులో నిందితుడిగా ఉన్న శివరాంను అరెస్ట్ చేయొద్దని పోలీసులకు నాంపల్లి కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కేసులో ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు చెప్పింది. కేసు దర్యాప్తు జరుగుతుండంతో రిమాండ్ ఇవ్వలేమని వెల్లడించింది. చీఫ్ జస్టిస్ ను కలిసి కేసు పూర్తి వివరాలు తెలియజేస్తమని శివరాం రాథోడ్ తరపున న్యాయవాది తెలిపారు. శివరాంపై నేరారోపణ అభియోగాలు లేనందున జ్యుడిషియల్ రిమాండ్ పిటిషన్ ను నాంపల్లి కోర్టు కోట్టేసింది.