ఈనెల 10వ తేదీ వరకు నుమాయిష్ బంద్

 ఈనెల 10వ తేదీ వరకు నుమాయిష్ బంద్

ఒమిక్రాన్‌ తెలంగాణ రాష్ట్రంలో విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి.దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ నిలిచిపోయింది, ప్రారంభమైన రెండు రోజులకే నుమాయిష్ నిలిపివేశారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాంపల్లిలో ప్రారంభమైన నుమాయిష్‌ ప్రవేశాన్ని నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈనెల 10వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో నుమాయిష్-2022ను తెలంగాణ గవర్నర్ తమిళిసై, హోంమంత్రి మహమూద్ అలీ జనవరి 1న  ప్రారంభించారు.కరోనా కేసులు పెరుగుతుండటంతో ఎగ్జిబిషన్ ను నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ పేర్కొంది.