మందకృష్ణ మాదిగపై నాంపల్లిలో కేసు నమోదు

మందకృష్ణ మాదిగపై నాంపల్లిలో కేసు నమోదు

మెహిదీపట్నం, వెలుగు: ఎమ్మార్పీఎస్​వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై నాంపల్లి పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. మాలలను కించపరిచేలా మందకృష్ణ కామెంట్స్​చేశాడని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్​చేశామని ఎస్సై సాయికుమార్ తెలిపారు. ‘మాలలు దోపిడీదారులు, గజదొంగలు, సైకోలు’ అంటూ మందకృష్ణ అవమానకరంగా మాట్లాడారని రాంప్రసాద్​ఫిర్యాదులో పేర్కొన్నారు. 

కులాల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతూ రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, డిసెంబర్ 1న నిర్వహించిన మాలల సింహగర్జన సభ సక్సెస్​కావడంతో ఓర్చుకోలేని మందకృష్ణ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇష్టమొచ్చినట్లు కామెంట్స్​చేశారని చెప్పారు. కాగా మందకృష్ణపై జీరో ఎఫ్ఐఆర్​నమోదు చేసి, కేసును ఖైరతాబాద్ పీఎస్ కు బదిలీ చేస్తున్నట్లు ఎస్సై సాయి కుమార్ తెలిపారు.