ఇదొక ఫ్యామిలీ ఫిల్మ్.. మహేష్ బాబు ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారు: నమ్రతా శిరోద్కర్

‘ముఫాసా: ది లయన్ కింగ్’ చిత్రంలోని  సింహం పాత్రకు మహేష్ బాబు చాలా ఎంజాయ్ చేస్తూ డబ్బింగ్ చెప్పారని ఆయన భార్య నమ్రతా శిరోద్కర్ అన్నారు. మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 20న తెలుగుతో పాటు తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో నమ్రతా మాట్లాడుతూ ‘ఇలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ని డబ్ చేయడం ఒక చాలెంజ్. డిస్నీ టీం చాలా ఎఫెర్ట్ పెట్టి అద్భుతంగా తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నారు. ఇదొక ఫ్యామిలీ ఫిల్మ్. ఎమోషనల్ రైడ్. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

ఈ చిత్రంలోని టాకా పాత్రకు వాయిస్ ఓవర్ ఇచ్చిన  సత్యదేవ్‌‌‌‌‌‌‌‌, టిమోన్‌‌‌‌‌‌‌‌ పాత్రకు వాయిస్ ఇచ్చిన అలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇందులోని పుంబా పాత్రకు బ్రహ్మానందం, కిరోస్‌‌‌‌‌‌‌‌ పాత్రకు అయ్యప్ప పి శర్మ వాయిస్ అందించారు.