
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు జక్కన్న ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న SSMB29పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథని అందించగా దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ సినీ నిర్మాత కేఎల్ నారాయణ దాదాపుగా రూ.1200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే ఇప్పటికే జక్కన్న ఈ సినిమా షెడ్యూల్ కోసం ఓడిశాలోని దేవ్ మాలి, తోలో మాలి, కోలాబ్, పుట్ సీల్ ప్రాంతాలలో జక్కన్న టీమ్ షూటింగ్ లొకేషన్స్ షూటింగ్ స్పాట్స్ సెలెక్ట్ చేశాడు. దీంతో త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.
దీంతో బుధవారం మహేష్ ఒడిశాకు బయల్దేరాడు. ఇందులోభాగంగా మహేష్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఒడిశాకి వెళుతున్న సమయంలో ఫోటోగ్రాఫర్స్ కెమెరాకి చిక్కాడు. ఈ సమయంలో మహేష్ తో పాటూ ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ సెండాఫ్ ఇచ్చింది. అయితే ఒడిశాలోని కోలాబ్, పుట్ సీల్ ప్రాంతాలలో 4 రోజుల పాటూ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో మహేష్ తో మరో స్టార్ నటుడు మలయాళ స్టార్ హీరో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా పాల్గొనబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ALSO READ | RC 16: అద్భుతమైన లుక్లో కన్నడ శివన్న.. రామ్ చరణ్ సినిమా సెట్స్‌లో జాయిన్!
ఆర్.ఆర్.ఆర్ సినిమాతో భారీ హిట్ అందుకున్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈసారి SSMB29తో గ్లోబల్ హిట్ కొట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో SSMB29 ని ఇంటర్ నేషనల్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తున్నాడు. ఈక్రమంలో బడ్జెట్ కి ఏమాత్రం వెనుకాడకుండా షూటింగ్ లొకేషన్స్ కోసం ఆఫ్రీకా అడవులను చుట్టేసి వచ్చారు. ఇండియన్ సినీ చరిత్రలోనే ఇప్పటివరకూ ఏ సినిమాకి లేని విధంగా రూ.1000 కోట్లు మించి ఖర్చు చేస్తున్నారు. దీంతో SSMB29పై భారీ అంచనాలు నెలకొన్నాయి.