టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్లో మహేష్ నమ్రత (Mahesh Namrata) ముందు వరుసలో ఉంటారు. ఈ క్రేజీ సూపర్ స్టార్ కపుల్స్ వివాహబంధంలోకి అడుగు పెట్టి (Feb 10) ఇవాళ్టితో 20 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా నమ్రత తన ఇన్స్టా పేజీలో మహేష్తో ఉన్న ఓ బ్యూటిఫుల్ ఫోటో షేర్ చేస్తూ తమ అనుబంధాన్ని తెలిపింది. "నువ్వు, నేను కలిసి 20 అందమైన సంవత్సరాలు పూర్తయింది. ఎప్పటికీ నీతో NSG" అంటూ లవ్ ఎమోజిలు జోడించింది. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. మహేష్ ఫ్యాన్స్ పెళ్లి రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.
మీ బంధం జీవితాంతం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని నెటిజన్స్ కోరుకుంటూ పోస్టులు పెడుతన్నారు. అలాగే 'సూపర్ సక్సెస్ ఫుల్.. రెండు హృదయాలు, ఒక అందమైన ప్రయాణం!' అంటూ ఇరువురి ఫ్యాన్స్ క్యాప్షన్స్తో ట్రెండ్ చేస్తున్నారు.
అయితే, ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక స్త్రీ ఉంటుందని నమ్రత ఎప్పుడు నిరూపిస్తూ ఉంటుంది. సామజిక సేవలోను, వ్యాపారంలోను, కుటుంబ బాధ్యతలోనూ తన కర్తవ్యాన్ని రుజువు చేస్తూ మహేష్ బాబు బాటలో నడుస్తుంది. ఇప్పటికీ మహేష్ సూపర్ స్టార్గా సక్సెస్ ఫుల్గా రాణిస్తున్నాడంటే నమ్రత కూడా ఒక కారణమని చెప్పుకోవాలి.
1993లో ఫెమీనా మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న నమ్రత 2000లో ‘వంశీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘అంజి’తో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు.
‘వంశీ’ సినిమా సమయంలో మహేశ్, నమ్రత ప్రేమించుకున్నారు. 2005లో ఇద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. వివాహం అనంతరం నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పింది. వీరికి గౌతమ్,సితార ఇద్దరు పిల్లలు ఉన్నారు.