Namrata Shirodkar: గ్రాండ్గా పెళ్లి రిసెప్షన్.. నమ్రత ఫోటోలు షేర్.. ప్రిన్సెస్ సితార స్టన్నింగ్ లుక్ వైరల్..

Namrata Shirodkar: గ్రాండ్గా పెళ్లి రిసెప్షన్.. నమ్రత ఫోటోలు షేర్.. ప్రిన్సెస్ సితార స్టన్నింగ్ లుక్ వైరల్..

టాలీవుడ్ నిర్మాత మహేష్ రెడ్డి కుమారుడు నితీశ్ రెడ్డి-కీర్తిల పెళ్లి, ఇటీవలే దుబాయ్లో ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి (మార్చి 8న) నితీశ్ రెడ్డి-వివాహా రెసెప్షన్ వేడుక హైదరాబాద్లో సెలెబ్రేట్ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఇన్స్టాలో షేర్ చేశారు.

నమ్రత షేర్ చేసిన ఈ పెళ్లిఫోటోలో మహేష్ బాబు డాటర్ సితార స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. నేవీ బ్లూ షరారా సెట్‌లో అందమైన స్మైల్ ఇస్తూ ఆకట్టుకుంది. న‌మ్ర‌త భారీగా అలంకరించబడిన ఎరుపు రంగు డిజైన‌ర్ దుస్తుల్లో ట్రెడిష‌న‌ల్గా క‌నిపించారు.

ఇదే వేడుకలో హీరో రామ్ చరణ్ & ఉపాసనతో పాటు జూనియర్ ఎన్టీఆర్,లక్ష్మీ ప్రణతి జంట అటెండ్ అయ్యారు. ఇంకా వీరితో పాటుగా పలువురు టాలీవుడ్ స్టార్లు హాజరయ్యారు. ఉపాసన స్టైలిష్ లేత గోధుమరంగు ఎంబ్రాయిడరీ దుస్తులను ఎంచుకోగా, రామ్ చరణ్ క్లాసిక్ సూట్‌లో డాపర్‌గా కనిపించాడు.

Also Read : మీకు దండం పెడతా.. రష్మికపై ట్రోలింగ్ ఆపండి

ఇక చిరంజీవి, సురేఖ, నాగార్జున, నాగ చైతన్య, సుకుమార్ ఫ్యామిలీలు, దుబాయికి వెళ్లి పెళ్లి వేడుకలో సందడి చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి, అండ్ రెసెప్షన్ వేడుక ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిర్మాత మహేష్ రెడ్డి.. హీరో నాగార్జునతో షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ లాంటి సినిమాలు చేశారు. 

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ బాబు SSMB 29 (వర్కింగ్ టైటిల్) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఒడిశా అడవుల్లో జక్కన్న రూపొందించే కీలక సన్నివేశాల్లో పాల్గొంటున్నాడు. రెండ్రోజులుగా ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.అయితే, ఇపుడు నమ్రత పెళ్లి ఫొటోస్ పంచుకోవడంతో మహేష్ ఉంటే ఫంక్షన్ కి వెళ్ళేవాడు.. మిస్ అయ్యాడు.. జక్కన్న చేతిలో బంధీ అయ్యాడంటూ నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.