Unstoppable Promo: నా మనసులో మహారాజు నువ్వే.. సందడిగా బాలయ్య-వెంకీ మామ ఎపిసోడ్ ప్రోమో

Unstoppable Promo: నా మనసులో మహారాజు నువ్వే.. సందడిగా బాలయ్య-వెంకీ మామ ఎపిసోడ్ ప్రోమో

బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న‘అన్‌స్టాపబుల్‌ విత్  ఎన్బీకే ’(UnstoppableWithNBK) అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే మొదలైన 4వ సీజన్లో ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు, లక్కీ భాస్కర్ మూవీ టీమ్, కంగువ సూర్య, పుష్ప 2 అల్లు అర్జున్ తదితరులు వచ్చి ఆడియన్స్ను ఎంటర్టైన్ చేశారు. దీంతో ఈసారి నిర్వాహకులు "సంక్రాంతికి వస్తున్నాం" మూవీ టీమ్ తో సందడి చేసేందుకు సిద్దమవుతున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా డిసెంబర్ 24న బాలయ్య, వెంకీమామలకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ హీరోలిద్దరు ప్రోమోలో తమ మాటలతో ఇరగదీశాడు. వీరిద్దరి సినిమాలు డాకు మహారాజ్(జనవరి 12), సంక్రాంతికి వస్తున్నాం(జనవరి 14) ఒకేటైంలో రిలీజ్ కానున్నాయి. దీంతో 'మనం ఒకరికొకరం పోటీనా' అని బాలయ్య అనగా.. ఎక్కడమ్మా పోటీ అంటూ వెంకీ చమత్కరించాడు.

Also Read:- గేమ్ ఛేంజర్ బడ్జెట్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇన్ని వందల కోట్లా!

బాలయ్యను డాకూ అని సరదాగా అన్నారు వెంకీ. “నా మనసులో మహారాజు నువ్వే” అని బాలకృష్ణ వెంకటేశ్‍ను అన్నారు. వెంకీ తొడ కూడా కొట్టారు. ఇద్దరూ కాలిపై కాలు వేసుకొని స్టైలిష్‍గా కూర్చున్నారు. అలాగే చైతు ఫొటో చూపించి వెంకీ మామ నాగ చైతన్య రిలేషన్ చూపించారు.

అంతేకాకుండా చిరు, నాగ్, వెంకీ, బాలయ్య ఫొటోస్ ప్రజెంట్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలు అని చెప్పారు. రాముడు మంచి బాలుడు అని బాలయ్య అంటే.. కొంప తీసి నువ్వు అనుకుంటున్నావా అని వెంకీ సరదాగా అనడంతో నవ్వులు పూసాయి. ఇక షో మధ్యలో వెంకటేష్ అన్నయ్య సురేష్ బాబు ఎంట్రీ ఇవ్వగా సరదా సంభాషణలు మొదలయ్యాయి. ఇక చివర్లో వెంకటేష్ నాన్న డి రామానాయుడు ఫోటో చూపించగానే..  తమ తండ్రిని తలచుకొని వెంకటేశ్,సురేశ్ బాబు ఎమోషనల్ అయ్యారు. 

ఇప్పటివరకూ వెంకటేష్ టాక్ షోలలో పాల్గొనలేదు. మొదటిసారి బాలయ్య టాక్ షోకి గెస్ట్ గా వస్తున్నాడు. దీంతో ఈ ఎపిసోడ్ పై ఆసక్తి నెలకొంది. ఇకపోతే ఈ పూర్తి ఎపిసోడ్ శుక్రవారం (డిసెంబర్ 27న) సాయంత్రం 7 గంటలకు ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది.