
- ఫ్యాన్సీ నంబర్ కోసం ఏకంగా రూ.7.75 లక్షలు ఖర్చు
హైదరాబాద్ సిటీ, వెలుగు: వెహికల్స్ఫ్యాన్సీ నంబర్లకు క్రేజ్తగట్లేదు. లక్షలు ఖర్చయినా పర్లేదు.. కోరుకున్న నంబర్‌ను దక్కించుకునేందుకు ఎంతైనా చెల్లిస్తున్నారు. శనివారం ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసులో ఫ్యాన్సీ నంబర్ల వేలం నిర్వహించగా రూ.37,15,645 ఆదాయం వచ్చినట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు. టీజీ09ఎఫ్ 0001 నంబర్ కోసం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఏకంగా రూ.7,75,000 చెల్లించి సొంతం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన గ్యారేజ్‌లోని కార్లు 0001 సిరీస్‌తో ఉన్నాయని, కొత్తగా తీసుకున్న కారుకు కూడా అదే నంబర్వచ్చేలా చూసుకున్నారని సమాచారం.
అలాగే టీజీ09ఎఫ్0009ను కమలాలయ హైసాఫ్ట్ప్రైవేట్లిమిటెడ్ కంపెనీ వారు రూ.6,70,000కు, టీజీ09ఎఫ్9999ను ఎకో డిజైన్ స్టూడియో వారు రూ.99,999కు, టీజీ09ఎఫ్ 0005ను జెట్టి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ప్రైవేట్లిమిటెడ్వారు రూ.1,49,999కు, టీజీ09ఎఫ్0007ను కె.శ్రీనివాస్‌నాయుడు అనే వ్యక్తి రూ.1,37,779కు, టీజీ09ఎఫ్0019ను నేత్రావతి బలగప్పశివలింగప్ప రూ. 60వేలకు, టీజీ 09ఎఫ్0099ను రూ.4,75,999కు కాన్క్యాప్ఎలక్ట్రికల్ ప్రైవేట్ లిమిటెడ్వారు దక్కించుకున్నారు.